top of page

దాదాపు రెండు శతాబ్దాలుగా, 208 ఏళ్ల సుదీర్ఘ చరిత్రతో కొనసాగుతున్న మా నిత్య అన్నదాన పరంపరకు ఈ విధమైన గుర్తింపు లభించడం మా కుటుంబానికి మహత్తర గౌరవంగా భావిస్తున్నాము.

  • 19 hours ago
  • 1 min read

ఈరోజు (22 ఫిబ్రవరి 2026) ఈనాడు ఆదివారం బుక్‌లో మా పైడా చౌల్ట్రి యొక్క సేవా వారసత్వంపై ప్రత్యేక కథనం ప్రచురించబడింది.


దాదాపు రెండు శతాబ్దాలుగా, 208 ఏళ్ల సుదీర్ఘ చరిత్రతో కొనసాగుతున్న మా నిత్య అన్నదాన పరంపరకు ఈ విధమైన గుర్తింపు లభించడం మా కుటుంబానికి మహత్తర గౌరవంగా భావిస్తున్నాము. 🙏


ద్రాక్షారామం, కోటిపల్లి మరియు కాకినాడ ప్రాంతాలలో స్థాపితమైన మా పైడా చౌల్ట్రిలు, భక్తులకు అన్నప్రసాదం మరియు వసతి సదుపాయాలను అందిస్తూ సేవాధర్మాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నాయి.


ఈ సేవా కార్యక్రమాలన్నీ శ్రీ పైడా సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. సేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, నిబద్ధత మరియు దూరదృష్టి మా సంస్థకు మార్గదర్శక శక్తిగా నిలుస్తున్నాయి. ఆయన నాయకత్వంలో ఈ శతాబ్దాల వారసత్వం మరింత బలపడుతూ, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది

                     

పైడా శ్రీరామ్

మ్యానేజింగ్ డైరెక్టర్

పైడా విద్య మరియు చారిటబుల్ సంస్థలు.


 
 
 

Comments


bottom of page